![]() |
![]() |

బాలీవుడ్‌లో సెక్స్ బాంబ్‌గా పేరు తెచ్చుకున్న మల్లికా షెరావత్ అతి త్వరలో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. తమిళ దర్శకుడు వి.సి. వడివుడయన్ డైరెక్ట్ చేసే ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో త్రిభాషా చిత్రంగా ఏక కాలంలో నిర్మాణం కానున్నది. తెలుగులో ఈ సినిమాకు నాగమతి అనే టైటిల్, తమిళ వెర్షన్‌కు పంబట్టమ్ అనే టైటిల్ పెట్టారు. మూడు కాలాల్లో.. 1900, 1947, 1990 లలో ఈ సినిమా కథ సాగుతుంది.
ఇంతవరకు చేయని పాత్రను ఈ సినిమాలో మల్లిక చేయనున్నది. ఈ మూవీని ఇటీవలే ముంబైలో లాంఛనంగా ప్రారంభించారు. రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. పొట్టు, వీరమదేవి, షావుకార్‌పెట్టై లాంటి హారర్ మూవీస్‌తో వడివుడయన్ పేరు తెచ్చుకున్నాడు.
చార్లీ చాప్లిన్ 2, మొట్ట శివ కెట్ట శివ ఫేమ్ అమ్రిష్ ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ మూవీలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. నాగమతి ఒక యాక్షన్ హారర్ థ్రిల్లర్ అని చెప్పింది మల్లిక.
![]() |
![]() |