![]() |
![]() |

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన 'పుష్పక విమానం' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో.. తాజాగా మూవీ టీమ్ హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. 'పుష్పక విమానం' సినిమా ఫ్లైయింగ్ హిట్ అవడం సంతోషంగా ఉందన్నారు.
ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.."పుష్పక విమానం మీద మా అంచనాలు నిజమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ నుంచి కూడా హిట్ టాక్ వస్తోంది. అన్నయ్య విజయ్ యూఎస్ లో ఉన్నారు. థియేటర్ లలో 'పుష్పక విమానం' కు వస్తున్న రెస్పాన్స్ వీడియోలు ఆయనకు పంపించాం. విజయ్ నిర్మాతగా చాలా హ్యాపీగా ఫీలవుతున్నాడు. నాకు ఇండస్ట్రీ నుంచే కాకుండా యూఎస్ నుంచి కాల్స్ వస్తున్నాయి. కథ విన్నప్పుడు దర్శకుడు చెప్పాడు.. కామెడీ ఫ్లస్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ ఇష్టపడేలా సినిమా చేయొచ్చని, ఇవాళ థియేటర్లలో అదే రెస్పాన్స్ వస్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. కథలో సందర్భానుసారం వచ్చే కామెడీ సీన్స్ కు బాగా నవ్వుతున్నారు. ఇలాంటి సిట్యువేషనల్ కామెడీ ఈ మధ్య కాలంలో మనం చూడలేదు. 'పుష్పక విమానం' చిత్రాన్ని మీరు చూసి ఆనందించండి." అన్నారు.

హీరోయిన్ గీత్ సైని మాట్లాడుతూ.."పుష్పక విమానం సినిమా చూసి మా ఫ్యామిలీ మెంబర్స్ ఆనంద్ ఫ్యాన్స్ అయ్యారు. సినిమాను అందరూ ఇష్టపడుతున్నారు. మీనాక్షి క్యారెక్టర్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని టెన్షన్ పడ్డాను. కానీ థియేటర్లో ఫ్యామిలీ ఆడియన్స్ నా క్యారెక్టర్ ద్వారా రిలేట్ అవుతున్నారు. మీనాక్షి ద్వారా వచ్చే థ్రిల్ ను మీరు థియేటర్ లోనే చూడాలి. సునీల్, శాన్వీ మధ్య హిలేరియస్ కామెడీ ఉంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, మంచి మెసేజ్ ఉంది..థియేటర్ లలో పుష్పక విమానంను ఎంజాయ్ చేయండి." అని అన్నారు.
హీరోయిన్ శాన్వి మేఘన మాట్లాడుతూ.. "పుష్పక విమానం సినిమా ద్వారా నాకొక బిగ్ హిట్ దొరికింది. ఈ సినిమాలో ఆడియెన్స్ నా రేఖ క్యారెక్టర్ ను బాగా ఇష్టపడుతున్నారు. సునీల్ గారు, నా మధ్యన వచ్చే సీన్స్ అన్నీ నవ్విస్తున్నాయి. ఎక్కడ నవ్వుతారని మేం ఎక్స్ పెక్ట్ చేశామో ఆ సీన్సన్నింటికీ మంచి రెస్పాన్స్ వస్తోంది." అన్నారు.
దర్శకుడు దామోదర మాట్లాడుతూ.. "పుష్పక విమానం చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ కు సంతోషంగా ఉంది. ఫస్ట్ టైమ్ దర్శకుడిని కాబట్టి నా సినిమాను తెరపై చూస్తూ, నేను రాసిన కథకు, సీన్స్ కు, మాటలకు వస్తున్న స్పందన చూస్తుంటే సంతృప్తిగా ఉంది. ఆనంద్, నిర్మాత విజయ్ గారు నేను చెప్పింది నమ్మి, నేను సినిమా కోసం అడిగింది ఇచ్చి చేయించడం వల్లే ఇవాళ ఈ సక్సెస్ వచ్చింది. నరేష్, సునీల్ క్యారెక్టర్ ల ద్వారా మంచి కామెడీ జెనరేట్ అయ్యింది." అన్నారు.
![]() |
![]() |