![]() |
![]() |

టాలీవుడ్ స్టార్స్ థియేటర్ బిజినెస్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే 'ఏషియన్ సినిమాస్' భాగస్వామ్యంతో మహేష్ బాబు(ఏఎంబీ సినిమాస్), విజయ్ దేవరకొండ(ఏవీడీ) మల్టీ ప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు అల్లు అర్జున్ వంతు వచ్చింది. ఏషియన్ సినిమాస్ తో కలిసి బన్నీ స్టార్ట్ చేస్తున్న 'AAA సినిమాస్' పూజా కార్యక్రమం తాజాగా జరిగింది.
హైదరాబాద్ కి నడిబొడ్డున ఉండే అమీర్ పేట సత్యం థియేటర్ ఒకప్పుడు చాలా ఫేమస్. ఇప్పుడు ఆ స్థలంలో 'AAA సినిమాస్' రాబోతుంది. ప్రస్తుతం ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది. వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో ఈ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మల్టీప్లెక్స్ కి శనివారం బన్నీ చేతుల మీదుగా పూజా కార్యక్రమం జరిగింది. సునీల్ నారంగ్, నారాయణ దాస్ తదితరులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

సినిమాల విషయానికొస్తే బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' మూవీలో నటిస్తున్నారు. రష్మిక ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 'పుష్ప: ది రైజ్' డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |