![]() |
![]() |

బుల్లితెరపై స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ కనకాల వెండితెరపై రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల చేశారు మేకర్స్.
సుమ నటిస్తున్న సినిమాకు 'జయమ్మ పంచాయితీ' అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఫిక్స్ చేశారు. విభిన్నంగా డిజైన్ చేసిన మూవీ పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది. సుమ చీర కొంగు గాలిలో ఎగురుతుండగా.. ఆ కొంగుపై గ్రామంలోని విభిన్న పాత్రలు కనిపిస్తున్నాయి. ఇక శివగామిలా సీరియస్ లుక్ తో ఉన్న సుమ.. రోకలితో దంచితే రోలు పగిలిపోయినట్లుగా పోస్టర్ లో కనిపిస్తుంది. పోస్టర్ ని బట్టి చూస్తుంటే ఇది పక్కా పల్లెటూరి కథ అని, ఇందులో ఊరి పెద్దగా ఉండే జయమ్మ(సుమ) బాహుబలిలో శివగామిలా నా మాటే శాసనం అంటూ అందరినీ శాసిస్తుందని అర్థమవుతోంది. మరి జయమ్మగా సుమ వెండితెరపై ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.
వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై బలగ ప్రకాష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు విజయ్ కలివరపు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
![]() |
![]() |