![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమా షురూ అయింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పూజా కార్యక్రమం శనివారం జరిగింది. చిత్రబృందంతోపాటు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా తాజాగా విడుదల చేశారు. వింటేజ్ చిరంజీవిని గుర్తుచేస్తున్న ఈ పోస్టర్ మాస్ కి పూనకాలు తెప్పిస్తుంది.

ప్రీ లుక్ తోనే 'మెగా154' పక్కా మాస్ సినిమా అని చెప్పేసిన బాబీ.. ఫస్ట్ లుక్ తో ఊర మాస్ అనిపించేశారు. మాస్ గెటప్ లో నోట్లో బీడీ, చేతిలో లైటర్ తో ఉన్న చిరు లుక్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. మళ్ళీ పాత చిరుని చూపించారంటూ బాబీపై మెగా ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మెగాస్టార్ తో సినిమా చేయడంపై బాబీ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిరుని 'మాస్ మూలవిరాట్' అని సంభోదించిన ఆయన.. అరాచకం ఆరంభమైందని ట్వీట్ చేశారు. అంతేకాదు, "మెగాస్టార్, ఆయన పేరు వింటే.. అంతు లేని ఉత్సాహం! ఆయన పోస్టర్ చూస్తే..అర్ధం కాని ఆరాటం! తెర మీద ఆయన కనబడితే.. ఒళ్ళు తెలీని పూనకం! పద్దెనిమిదేళ్ల క్రితం... ఆయన్ని మొదటి సారి కలసిన రోజు కన్న కల.. నిజమవుతున్న ఈ వేళ మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను." అంటూ బాబీ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
![]() |
![]() |