![]() |
![]() |

నిత్యా మీనన్ తొలిసారి ఓ సినిమాకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. అదీ.. ఒక తెలుగు సినిమాకు. ఆ సినిమా పేరు 'స్కైలాబ్'. విశ్వక్ ఖండేరావు డైరెక్టర్‌గా పనిచేస్తోన్న ఈ మూవీని బ్రైట్ ఫ్యూచర్స్ బ్యానర్‌పై పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తుండగా, నిత్యా మీనన్ కంపెనీ బ్యానర్‌పై నిత్య సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. డైరెక్టర్ కథ చెప్పినప్పుడు ఇలాంటిది నిజంగా జరిగిందని తెలిసి ఆశ్చర్యపోయాననీ, అద్భుతమైన ఈ కథను తెరకెక్కించేటప్పడు నిర్మాతగా వుండాలని అనుకొని, నిర్మాతగా మారాననీ ఆమె చెప్పారు.
ఇటీవల జరిగిన 'స్కైలాబ్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆమె ప్రస్తుతం తన దృష్టిలో డైరెక్టర్ విశ్వక్, ప్రొడ్యూసర్ పృథ్వీ తన టాప్ ఫేవరేట్ మనుషులుగా ఆమె అభివర్ణించింది. ఆ తర్వాత ఈ సినిమాలో తనతో పాటు ప్రధాన పాత్రలు పోషించిన సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ నటనను గొప్పగా పొగిడింది. ఈ సందర్భంగా రాహుల్ చూస్తూ ఆమె కన్నుకొట్టడం అందరి దృష్టినీ ఆకర్షించింది.
"ట్రైలర్ చూశాక వాట్ ఫ్యాబ్యులస్ యాక్టర్స్ అనుకున్నాను. ఒక చిన్న ఎక్స్‌ప్రెషన్ కూడా రాహుల్ గొప్పగా ఇచ్చాడు. కంటితో సత్య ఇచ్చిన మూవ్‌మెంట్ చూసి చాలా ఇష్టపడ్డాను. అలాంటి చక్కని నటులతో కలిసి నటించినందుకు చాలా ప్రౌడ్‌గా ఫీలవుతున్నా. వాళ్లు ఈ సినిమాలో భాగమైనందుకు, వాళ్లతో పాటు నా పేరు కూడా ఉన్నందుకు గర్వంగా అనిపిస్తోంది. వాళ్లతో మున్ముందు కూడా కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాను. నువ్వెంత మ్యాడో అలాగే ఉండు రాముల్. ఐ లవ్ ఇట్" అంటూ కన్నుకొట్టింది నిత్య. దాంతో రాహుల్‌తో పాటు సత్యదేవ్ కూడా తెగ నవ్వేశాడు.
![]() |
![]() |