![]() |
![]() |

`స్టూడెంట్ నెంబర్ వన్` (2001)తో కెప్టెన్ గా తొలి అడుగేసిన దర్శకధీరుడు రాజమౌళి.. ఇటీవలే 20 ఏళ్ళ కెరీర్ ని పూర్తి చేసుకున్నారు. ఈ ప్రయాణంలో 11 సినిమాలు చేసిన జక్కన్న.. అన్నింటితోనూ సంచలనాలు సృష్టించారు. ఒక్కో చిత్రాన్ని ఒక్కో తరహాలో తెరకెక్కించి.. ఎలాంటి సినిమానైనా తీయగల నిర్దేశకుడిగా గుర్తింపు పొందారు. రాబోయే చిత్రం `ఆర్ ఆర్ ఆర్` కోసం కూడా ఇదే పంథాలో వెళుతున్నారు. ఇప్పటివరకు తను టచ్ చేయని హిస్టారికల్ ఫిక్షన్ జోనర్ ని ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఎంచుకున్నారు రాజమౌళి. ప్రచార చిత్రాలతో సినిమాపై అంచనాలు పెంచేస్తూ.. 2022 సంక్రాంతికి సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. జక్కన్న తన 20 ఏళ్ళ కెరీర్ లో చేస్తున్న తొలి మల్టిస్టారర్ ఇది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి సమకాలీన అగ్ర కథానాయకులతో ఈ మల్టిస్టారర్ చేయడం అనేది పెద్ద సవాల్ అనే చెప్పాలి. మరి.. ఇప్పటివరకు మల్టిస్టారర్ సబ్జెక్ట్స్ టచ్ చేయని జక్కన్న.. ఫస్ట్ మల్టిస్టారర్ తో తన సంచలన విజయపరంపరని కొనసాగిస్తారేమో చూడాలి.
![]() |
![]() |