![]() |
![]() |

దివంగత దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణరావు ఇంటికి సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారి చేసింది. ఆయన తనయులు అరుణ్, ప్రభులకు ఆర్డర్ 34, సీపీసీ 151 సెక్షన్ల కింద సివిల్ కోర్టు బుధవారం నోటీసులు పంపింది.
వ్యాపార లావేదేవిల్లో భాగంగా ఓ ప్లాంట్ నిర్మాణం కోసం గుంటూరు జిల్లాకు చెందిన అట్లూరి సోమశేఖర్ రావు అనే వ్యక్తి వద్ద దాసరి కుమారులు ప్రభు, అరుణ్ లు 2 కోట్ల 11 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. ఒప్పందం ప్రకారం తిరిగి డబ్బులు చెల్లించడంలో వాళ్లు జాప్యం చేస్తుండటంతో సోమశేఖర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన డబ్బులు చెల్లించేలా వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. దాసరి ఇంటికి నోటీసులు పంపుతూ.. నవంబర్ 15 లోపు డబ్బులు చెల్లించాల్సిందిగా ప్రభు, అరుణ్ లను ఆదేశించింది.
కాగా, తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించమని అడిగినందుకు.. దాసరి కుమారులు తనను చంపుతామని బెదిరిస్తున్నారని గతంలో సోమశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
![]() |
![]() |