Home

»

Latest News

క్యూ క‌డుతున్న రాక్ స్టార్ సినిమాలు.. రెండు నెల‌ల్లో నాలుగు చిత్రాలు!

Nov 3, 2021 4:03PM

తెలుగునాట హ‌వా సాగిస్తున్న యువ సంగీత ద‌ర్శ‌కుల్లో రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ ఒక‌రు. ఒక‌వైపు అగ్ర క‌థానాయ‌కుల‌తోనూ.. మ‌రోవైపు యంగ్ హీరోల‌తోనూ సినిమాలు చేస్తూ త‌న‌దైన బాణీల‌తో ఎంట‌ర్టైన్ చేస్తున్నారీ స్వ‌ర త‌రంగం. కాగా నవంబ‌ర్, డిసెంబ‌ర్ నెల‌ల్లో నాలుగు చిత్రాల‌తో సందడి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు డీఎస్పీ. వీటిలో రెండు బిగ్ టికెట్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. త‌న ల‌క్కీ ప్రొడ్యూస‌ర్స్ లో ఒక‌రైన `దిల్` రాజు కాంబినేష‌న్ లో దేవి శ్రీ ప్ర‌సాద్ 13వ సారి జ‌ట్టుక‌ట్టిన `రౌడీ బాయ్స్` ఈ నెల 19న విడుద‌ల కానుండ‌గా.. వారం త‌రువాత అంటే న‌వంబ‌ర్ 26న కీర్తి సురేశ్, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తి బాబు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన `గుడ్ ల‌క్ స‌ఖి` రాబోతోంది.

అలాగే  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో `ఆర్య`, `ఆర్య 2` త‌రువాత డీఎస్పీ చేస్తున్న `పుష్ప - ద రైజ్` పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా డిసెంబ‌ర్ 17న  థియేట‌ర్స్ లోకి రానుండ‌గా.. అతి త్వ‌ర‌లో మాస్ మ‌హారాజా ర‌వితేజ కాంబినేష‌న్ లో చేసిన `ఖిలాడి` రిలీజ్ కానుంది. బ‌హుశా డిసెంబ‌ర్ ప్ర‌థ‌మార్ధంలో `ఖిలాడి` విడుద‌ల కావ‌చ్చ‌ని వినిపిస్తోంది.

మ‌రి.. రెండు నెల‌ల్లో నాలుగు చిత్రాల‌తో క్యూ క‌డుతున్న దేవి శ్రీ ప్ర‌సాద్.. ఆయా సినిమాల‌తో ఎలాంటి ఫ‌లితాల‌ను అందుకుంటారో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com