Home

»

Latest News

మెహ్రీన్ కి మ‌ళ్ళీ మంచి రోజులొస్తాయా?

Nov 3, 2021 5:29PM

`కృష్ణ‌గాడి వీరప్రేమ‌గాథ‌`(2016), `మ‌హానుభావుడు` (2017), `రాజా ది గ్రేట్` (2017).. ఇలా తెలుగునాట త‌న కెరీర్ ఆరంభంలోనే మూడు వ‌రుస విజ‌యాల‌ను అందుకుంది ఉత్త‌రాది సొగ‌సు మెహ్రీన్. తొలి రోజుల్లోనే హ్యాట్రిక్ హీరోయిన్ గా ప్ర‌త్యేక గుర్తింపు పొందింది. అయితే, ఆ త‌రువాత మాత్రం ఆ జోరు చూపించ‌లేక‌పోయింది. `కేరాఫ్ సూర్య‌`, `జ‌వాన్`(2017), `పంతం`, `నోటా`, `క‌వ‌చం` (2018).. ఇలా ఐదు వ‌రుస ప‌రాజ‌యాల‌ను చ‌విచూసింది. ఈ నేప‌థ్యంలో.. `ఎఫ్ 2` (2019) ఘ‌న‌విజ‌యం ఆమెకు నూత‌నోత్తేజాన్ని ఇచ్చింది. `రాజా ది గ్రేట్` త‌రువాత అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో చేసిన ఈ మూవీ.. మెహ్రీన్ ని మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ లోకి తీసుకొచ్చింది.

కాగా `ఎఫ్ 2` స‌క్సెస్ త‌రువాత `చాణ‌క్య‌` (2019), `ఎంత మంచివాడ‌వురా`, `అశ్వ‌థ్థామ‌` (2020) వంటి హ్యాట్రిక్ ఫ్లాప్స్ మ‌ళ్ళీ మెహ్రీన్ కెరీర్ ని ఇబ్బందుల్లోకి నెట్టాయి.  ఈ క్ర‌మంలో రాబోయే చిత్రాలు `మంచి రోజులు వ‌చ్చాయి`, `ఎఫ్ 3`పైనే ఆశ‌లు పెట్టుకుంది ఈ స్ట‌న్నింగ్ బ్యూటీ. `మ‌హానుభావుడు` త‌రువాత మారుతి ద‌ర్శ‌క‌త్వంలో చేసిన సినిమా కావ‌డంతో `మంచి రోజులు వ‌చ్చాయి`పైన‌.. `రాజా ది గ్రేట్`, `ఎఫ్ 2` త‌రువాత అనిల్ రావిపూడి కాంబోలో చేస్తున్న మూవీ కావ‌డంతో `ఎఫ్ 3` పైన మెహ్రీన్ మంచి న‌మ్మ‌కంతో ఉంది. మ‌రి.. ల‌క్కీ డైరెక్ట‌ర్స్ కాంబినేష‌న్స్ తో మెహ్రీన్ కి మ‌ళ్ళీ మంచి రోజులొస్తాయా?  వెయిట్ అండ్ సీ!

కాగా, `మంచి రోజులు వ‌చ్చాయి` దీపావ‌ళి కానుక‌గా రేపు (న‌వంబ‌ర్ 4) విడుద‌ల కానుండ‌గా.. `ఎఫ్ 3` వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ కానుంది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com