![]() |
![]() |

`మహానటి`తో సంచలన విజయాన్ని అందుకోవడమే కాకుండా `ఉత్తమ నటి`గా జాతీయ పురస్కారాన్ని సైతం సొంతం చేసుకుంది కేరళకుట్టి కీర్తి సురేశ్. అయితే, ఆ తరువాత ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ `పెంగ్విన్`, `మిస్ ఇండియా` ఆ మ్యాజిక్ ని కొనసాగించలేకపోయాయి. ఓటీటీ వేదికల్లో స్ట్రీమ్ అయిన ఈ రెండు చిత్రాలకూ నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో.. రాబోయే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ `గుడ్ లక్ సఖి`పైనే ఆశలు పెట్టుకుంది కీర్తి. నవంబర్ 26న ఈ స్పోర్ట్స్ డ్రామా థియేటర్స్ లో సందడి చేయనుంది.
కాగా, అదే రోజున మరో ఆసక్తికరమైన తెలుగు చిత్రం రాబోతోంది. అదే.. యువ కథానాయకుడు రాజ్ తరుణ్ నటించిన `అనుభవించు రాజా`. కామిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కూడా నవంబర్ 26నే టార్గెట్ చేసుకుంది. మరి.. కీర్తి సురేశ్ వర్సెస్ రాజ్ తరుణ్ అన్నట్లుగా ఉన్న ఈ ఆసక్తికర పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.
`గుడ్ లక్ సఖి`కి నగేశ్ కకునూర్ దర్శకత్వం వహించగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించారు. ఇక `అనుభవించు రాజా` విషయానికి వస్తే శ్రీను గవిరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి మెలోడీ స్పెషలిస్ట్ గోపీసుందర్ బాణీలు అందించారు.
![]() |
![]() |