![]() |
![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురాం దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'సర్కారు వారి పాట'. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13, 2022 న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా విడుదలను వాయిదా వేస్తూ ఫ్యాన్స్ కు మేకర్స్ షాక్ ఇచ్చారు. కొత్త విడుదల తేదీతో తాజాగా ఓ పోస్టర్ ను వదిలారు.
2022 జనవరిలో విడుదల కావాల్సిన 'సర్కారు వారి పాట' దాదాపు మూడు నెలలు వెనక్కి వెళ్ళింది. ఏప్రిల్ 1 న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఉగాది(ఏప్రిల్ 2) కానుకగా ఒకరోజు ముందు సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే మూవీ విడుదల వాయిదా పడటంతో కొందరు ఫ్యాన్స్ నిరాశ చెందగా.. రిలీజ్ డేట్ తో మరికొందరు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ 1(ఫూల్స్ డే)ని నెగటివ్ సెంటిమెంట్ గా భావిస్తుంటారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ ఏప్రిల్ 1 న 'శక్తి' సినిమాను విడుదల చేసి డిజాస్టర్ ను మూటగట్టుకున్నాడు. దీంతో మహేష్ ఫ్యాన్స్ లో ఆందోళన నెలకొంది. విడుదల తేదీని మార్చ్ 31కి మార్చాలని సోషల్ మీడియాలో కోరుతున్నారు. మరి మహేష్ ఫ్యాన్స్ కోరిక మేరకు విడుదల తేదీ విషయంలో మేకర్స్ పునరాలోచన చేస్తారేమో చూడాలి.

'సర్కారు వారి పాట' సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.
![]() |
![]() |