![]() |
![]() |

వరుస సినిమాలతో బిజీగా ఉన్న టాలెంటెడ్ యాక్టర్ రానా దగ్గుబాటి సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గానే ఉంటారు. తాజాగా 'విరాటపర్వం' సినిమా గురించి ఓ వెబ్ సైట్ రాసిన కథనంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన రానా.. 'ఎవడు బ్రో నీకు చెప్పింది.. నీ సోది' అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
రానా ప్రధాన పాత్రలో 'నీది నాది ఒకే కథ' ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'విరాటపర్వం'. ఇందులో రానాకి జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. గతంలో ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది అంటూ వార్తలు రాగా.. వాటిని మూవీ టీమ్ ఖండించింది. అయితే ఇప్పుడు ఏకంగా 'విరాటపర్వం' డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ మధ్య గొడవ అంటూ ఒక వెబ్ సైట్ రాసుకొచ్చింది. డైరెక్టర్ తో విభేదాలు రావడంతో ఈ సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తప్పుకున్నారని పేర్కొంది.

'విరాటపర్వం' డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ మధ్య గొడవ న్యూస్ పై రానా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆ న్యూస్ లింక్ ను ట్విట్టర్ లో షేర్ చేసిన ఆయన.. 'ఎవడు బ్రో నీకు చెప్పింది.. నీ సోది' అంటూ నవ్వుతూనే చురకలు అంటించారు. ప్రస్తుతం రానా ట్వీట్ వైరల్ గా మారింది.

సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్న 'విరాటపర్వం'లో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
![]() |
![]() |