![]() |
![]() |

స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజుకి అచ్చొచ్చిన సంగీత దర్శకుడిగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కి ప్రత్యేక స్థానముంది. తమ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించిన రెండో చిత్రం `ఆర్య` (2004) నుంచి డీఎస్పీతో జర్నీ చేస్తూనే ఉన్నారు రాజు. వీరి కాంబోలో వచ్చిన ప్రతీ సినిమా మ్యూజికల్ గానూ, కమర్షియల్ గానూ మెప్పించినదే కావడం విశేషం.
`ఆర్య` (2004), `భద్ర` (2005), `బొమ్మరిల్లు` (2006)తో తొలి హ్యాట్రిక్ కొట్టిన రాజు - డీఎస్పీ కాంబో.. ఆపై స్వల్ప విరామం అనంతరం చేసిన `మిస్టర్ పర్ ఫెక్ట్` (2011)తో పాటు `ఎవడు` (2014), `నేను లోకల్` (2017), `డీజే` (2017), `ఎంసీఏ` (2017), `హలో గురు ప్రేమ కోసమే`(2018), `ఎఫ్ 2` (2019)తోనూ ఆ విజయపరంపరని కొనసాగించింది. అలాగే వేరే నిర్మాతలతో కలిసి రాజు నిర్మించిన `మహర్షి` (2019), `సరిలేరు నీకెవ్వరు` (2020) కూడా దేవి శ్రీ సంగీత సారథ్యంలోనే రూపొంది మంచి విజయం సాధించాయి. మొత్తంగా.. 12 విజయాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజు - డీఎస్పీ కాంబో `రౌడీ బాయ్స్`తో 13వ హిట్ కి రెడీ అంటోంది. మరి.. జట్టుకట్టిన ప్రతీసారి హిట్ కొడుతున్న రాజు - డీఎస్పీ కాంబినేషన్.. `రౌడీ బాయ్స్`తోనూ ఆ ఫీట్ ని కొనసాగిస్తుందేమో చూడాలి.
కాగా అశిష్ రెడ్డి, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన `రౌడీ బాయ్స్`కి శ్రీ హర్ష దర్శకత్వం వహించాడు. నవంబర్ 19న విడుదల కానున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ నుంచి ఇప్పటికే రిలీజైన రెండు సింగిల్స్ కూడా యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేశాయి.
![]() |
![]() |