![]() |
![]() |

అక్టోబర్ 29న కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మృతి దేశంలోని ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్‌కు గురిచేసింది. ఆయన అభిమానుల హృదయాలైతే బద్దలైపోయాయి. పునీత్ కేవలం తెరమీదే కాదు, తెర బయట కూడా హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న సేవా కార్యక్రమాలు అన్నీ ఇన్నీ కావు. వాటిలో 1800 మంది పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పించడం ఒకటి.
ఇటీవల తన సినిమా 'ఎనిమీ' ప్రమోషనల్ ఈవెంట్ సందర్భంగా పునీత్ సేవా తత్పరతను కొనియాడిన హీరో విశాల్, ఆయన మృతి ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రమే కాకుండా సమాజానికి కూడా తీరని లోటుగా పేర్కొన్నాడు. "పునీత్ రాజ్‌కుమార్ కేవలం ఒక మంచి నటుడు మాత్రమే కాదు, ఒక మంచి స్నేహితుడు కూడా. అతనిలాంటి డౌన్ టు ఎర్త్ సూపర్‌స్టార్‌ను నేనింతదాకా చూడలేదు. ఆయన ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. పునీత్ రాజ్‌కుమార్ ద్వారా ఉచిత విద్య పొందుతున్న 1800 మంది స్టూడెంట్స్ బాధ్యతను వచ్చే ఏడాది నుంచి నేను వహిస్తాను" అని అతను హామీ ఇచ్చాడు.
అంతకుముందు పునీత్ మృతికి తన ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేసిన విశాల్, "నా గుడ్ ఫ్రెండ్ పునీత్ రాజ్‌కుమార్ చనిపోయాడనీ, ఇకలేడనీ అంటే నమ్మలేకపోతున్నాను. అతని ఆత్మకు శాంతి చేకూరాలి. అతనికి నా ప్రగాఢ నివాళులర్పిస్తున్నాను. ఈ పరీక్షా కాలంలో అతని కుటుంబం నిబ్బరంగా ఉండాలి. కర్నాటక మూవీ ఇండస్ట్రీకి ఇది తీరని నష్టం. ఒక డియర్ ఫ్రెండ్‌గా నాకు తీరని లోటు" అని రాసుకొచ్చాడు.
![]() |
![]() |