![]() |
![]() |

దక్షిణాది బాక్సాఫీస్ ని శాసించిన స్టార్స్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరు. `ఎందిరన్` (రోబో) (2010) తరువాత ఆ స్థాయి విజయాన్ని మళ్ళీ అందుకోలేకపోయిన రజినీకాంత్.. త్వరలో `అణ్ణాత్త`గా పలకరించబోతున్నారు. భారీ తారాగణంతో రూపొందిన ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా తెలుగులో `పెద్దన్న`గా అనువాదం కానుంది. దీపావళి కానుకగా నవంబర్ 4న ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్స్ లోకి రానుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన రజినీకాంత్ చిత్రాల్లో సింహభాగం బాక్సాఫీస్ హాట్ ఫేవరేట్ గా నిలిచాయి. రజినీ నటుడిగా ఎదిగే దశలో చేసిన `అంతులేని కథ`.. హీరోగా ఎదిగే క్రమంలో చేసిన `ముళ్ళుమ్ మలరుమ్` (తెలుగులో `సీతమ్మ పెళ్ళి`గా రీమేక్ అయింది) సిస్టర్ సెంటిమెంట్ తో రూపొంది ఆకట్టున్నవే. ఇక స్టార్ అయ్యాక చేసిన `అణ్ణామలై` (తెలుగులో `కొండపల్లి రాజా`గా రీమేక్ అయింది), `బాషా`, `పడయప్పా` (తెలుగులో `నరసింహా`) అయితే బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అలాగే తెలుగులో అతిథిగా నటించిన `పెదరాయుడు`లోనూ రజినీ పోషించిన పాపారాయుడు పాత్రకి సిస్టర్ సెంటిమెంట్ ఉంటుంది. ఈ సినిమా అప్పట్లో తెలుగునాట ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది కూడా. ఈ నేపథ్యంలో.. రజినీ చాన్నాళ్ళ తరువాత చేస్తున్న అవుట్ అండ్ అవుట్ సిస్టర్ సెంటిమెంట్ మూవీ అయిన `అణ్ణాత్త` కూడా బాక్సాఫీస్ ని రూల్ చేస్తుందేమో చూడాలి.
కాగా, `శౌర్యం` శివ డైరెక్ట్ చేసిన `అణ్ణాత్త`లో రజినీకాంత్ కి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటించింది.
![]() |
![]() |