![]() |
![]() |

మిల్కీ బ్యూటీ తమన్నా రెండోసారి మెగాస్టార్ చిరంజీవి సరసన నటించేందుకు అధికారికంగా సంతకం చేసింది. ఆ సినిమా.. 'భోళాశంకర్'. మెహర్ రమేశ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఆమె చిరంజీవి జోడీగా నటించనుంది. ఇదివరకు 'సైరా.. నరసింహారెడ్డి' మూవీలో చిరంజీవి ప్రేయసిగా ఆమె కీలక పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. రెండు నెలల క్రితమే 'భోళాశంకర్'లో నటించడానికి తమన్నా అంగీకరించింది. అయితే అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చి, సంతకం చేయించుకోవడానికి నిర్మాతలు రెండు నెలల టైమ్ తీసుకున్నారు.
త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నందుకు, ఇప్పుడు ఆమెతో వారు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. 'భోళాశంకర్'లో చిరు చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తోంది. అజిత్ నటించిన తమిళ హిట్ ఫిల్మ్ 'వేదాళమ్'కు ఇది రీమేక్. నవంబర్ 15న సెట్స్ మీదకు వెళ్తున్న ఈ మూవీని ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. అయితే తమన్నాకు సంబంధించిన షూటింగ్ మాత్రం జనవరిలో జరుగుతుందని సమాచారం.
ప్రస్తుతం తమన్నా 'ఎఫ్3' మూవీలో వెంకటేశ్ జోడీగా నటిస్తోంది. జనవరిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
![]() |
![]() |