![]() |
![]() |

గోపీచంద్ కథానాయకుడిగా నటించిన `ఒంటరి` (2008) చిత్రంతో తెలుగు తెరకు నాయికగా పరిచయమైంది కేరళకుట్టి భావన. ఆపై నితిన్ `హీరో` (2008), శ్రీకాంత్ `మహాత్మ` (2009) సినిమాల్లోనూ సందడి చేసింది. చివరిసారిగా రవితేజ `నిప్పు` (2012)లో అతిథిగా మెరిసిన భావన.. మళ్ళీ టాలీవుడ్ లో కనిపించనేలేదు. అయితే, అడపాదడపా అనువాద చిత్రాలతో మాత్రం పలకరిస్తూ వస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో సెకండ్ లీడ్ గా ఎంపికైందట భావన. ఆ వివరాల్లోకి వెళితే.. సీనియర్ స్టార్ నందమూరి బాలకృష్ణ హీరోగా `క్రాక్` కెప్టెన్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ వెంచర్.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాలో ఇద్దరు నాయికలకు స్థానముందట. మెయిన్ లీడ్ గా శ్రుతి హాసన్ పేరు వినిపిస్తుండగా.. తాజాగా సెకండ్ లీడ్ గా భావన ఎంపికైందని బజ్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
![]() |
![]() |