![]() |
![]() |

సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా నటించిన మొదటి సినిమా `రాజకుమారుడు` (1999) మొదలుకుని ప్రీవియస్ మూవీ `సరిలేరు నీకెవ్వరు` (2020) వరకు పలు చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో అలరించారు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్. ప్రతినాయకుడిగా, తండ్రిగా, మేనమామగా.. ఇలా విభిన్న పాత్రల్లో సందడి చేశారు. కట్ చేస్తే.. మహేశ్ రాబోయే చిత్రం `సర్కారు వారి పాట`లోనూ ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారట. అంతేకాదు.. ఇందులో మహేశ్ కి తండ్రిగా ప్రకాశ్ దర్శనమివ్వనున్నారట.
అదే గనుక నిజమైతే.. మహేశ్ బాబుకి తండ్రిగా ప్రకాశ్ రాజ్ నటించే నాలుగో చిత్రంగా `సర్కారు వారి పాట` నిలుస్తుంది. గతంలో `దూకుడు` (2011), `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` (2013), `మహర్షి` (2019) సినిమాల్లో మహేశ్ కి నాన్నగా ఆకట్టుకున్నారు ప్రకాశ్ రాజ్. ఆ మూడు చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. మరి.. హిస్టరీ రిపీట్ అయితే `సర్కారు వారి పాట` బొమ్మ కూడా బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోతుంది. చూద్దాం.. ఏం జరుగుతుందో!
కాగా, `సర్కారు వారి పాట`లో మహేశ్ బాబుకి జంటగా కేరళకుట్టి కీర్తి సురేశ్ నటిస్తోంది. పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు అందిస్తున్నారు.
![]() |
![]() |