![]() |
![]() |

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ పార్థివ దేహానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్.. పునీత్ కి నివాళులు అర్పించారు.
పునీత్, ఎన్టీఆర్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఇద్దరూ బ్రదర్స్ లా ఉంటారు. పునీత్ పలు ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్ తో తన అనుబంధం గురించి చెప్పారు. అంతేకాదు పునీత్ నటించిన 'చక్రవ్యూహ' సినిమాలో ఎన్టీఆర్ 'గెలయా..గెలయా' అనే పాటను కూడా పాడారు. ఎంతో సన్నిహితంగా ఉండే పునీత్ ఇక లేరనే వార్త తెలియగానే ఎన్టీఆర్ షాకయ్యారు. శనివారం ఆయన బెంగుళూరు చేరుకుని పునీత్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. చాలా సేపు పునీత్ పార్థివ దేహాన్ని అలాగే చూస్తూ ఉండిపోయిన ఎన్టీఆర్.. అనంతరం పునీత్ సోదరుడు శివ రాజ్‌కుమార్‌ను పరామర్శించారు.
ప్రస్తుతం పునీత్ పార్థివ దేహాన్ని కంఠీరవ స్టేడియంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. మరోవైపు ఈరోజు జరగాల్సిన అంత్యక్రియలు.. అమెరికా నుంచి పునీత్ కుమార్తె రాక ఆలస్యం అవుతుండడంతో వాయిదా పడ్డాయి. ఆమె తుది చూపు చూసిన తర్వాత పునీత్ అంత్యక్రియలు ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతాయి.
![]() |
![]() |