![]() |
![]() |

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఇందులో కొమురం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన భీమ్, రామ్ ల పోస్టర్స్, వీడియోస్ ఆకట్టుకున్నాయి. తాజాగా గ్లింప్స్ కు సంబంధించిన అప్డేట్ వచ్చింది.
'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్ రిలీజ్ డేట్, టైంను రివీల్ చేస్తూ తాజాగా మూవీ టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఎన్టీఆర్, చరణ్ లపై డిజైన్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. నవంబర్ 1 న ఉదయం 11 గంటలకు గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా పోస్టర్ లో ఉంది. అలాగే, ఈ గ్లింప్స్ 45 సెకండ్ల నిడివి ఉంటుందని మేకర్స్ తెలియజేశారు. 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అని సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
'ఆర్ఆర్ఆర్'లో ఆలియా భట్, ఓలివియా మోరీస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్, శ్రియ శరణ్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ మల్టీస్టారర్ 2022, జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
![]() |
![]() |