![]() |
![]() |

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతితో తెలుగు సినీ పరిశ్రమ కూడా దిగ్భ్రాంతికి గురైంది. టాలీవుడ్ కు చెందిన ఎందరో సినీ ప్రముఖులతో పునీత్ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో పలువురు టాలీవుడ్ ప్రముఖులు పునీత్ చివరి చూపు కోసం బెంగళూరుకు కదిలారు. నందమూరి బాలకృష్ణ అయితే పునీత్ పార్థివదేహాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు.
నందమూరి, రాజ్‌కుమార్ కుటుంబాలకు మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పునీత్ రాజ్‌కుమార్, శివరాజ్‌కుమార్ లతో బాలకృష్ణకు మంచి బాండింగ్ ఉంది. బాలకృష్ణను పునీత్ ను అన్నయ్య అని పిలిచేవారు. సోదరుడిలా భావించే పునీత్ మరణంతో బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. శనివారం ఉదయం బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి వెళ్లి పునీత్ కు నివాళులర్పించారు. పునీత్ పార్థివదేహాన్ని చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన బాలకృష్ణ కన్నీరు పెట్టుకున్నారు.
బాలకృష్ణతోపాటు నరేశ్, శివబాలాజీ, ప్రభుదేవా సైతం పునీత్‌కు నివాళులర్పించారు. అలాగే చిరంజీవి, ఎన్టీఆర్ కూడా బెంగళూరు చేరుకున్నారని తెలుస్తోంది.
![]() |
![]() |