![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవిని మాస్ హీరోగా నిలబెట్టిన చిత్రాల్లో `చట్టానికి కళ్ళు లేవు` ఒకటి. తమ తండ్రిని దారుణంగా చంపిన హంతకులను శిక్షించడం కోసం వేర్వేరు మార్గాలను ఎంచుకున్న అక్కాతమ్ముళ్ళ కథే.. ఈ `చట్టానికి కళ్ళు లేవు` చిత్రం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించే యువకుడు విజయ్ గా చిరంజీవి నటించగా.. అతణ్ణి అరెస్ట్ చేయడానికి ప్రయత్నించే పోలీస్ ఇన్సెపెక్టర్ దుర్గగా అతని అక్క పాత్రలో లక్ష్మి అభినయించారు. హంతకులుగా హేమసుందర్, కన్నడ ప్రభాకర్, సిలోన్ మనోహర్ నటించారు. తమిళ చిత్రం `సట్టమ్ ఒరు ఇరుట్టురై` (విజయకాంత్, పూర్ణిమా దేవి, వసుమతి) ఆధారంగా రూపొందిన ఈ సినిమాని మాతృక దర్శకుడు ఎస్.ఎ. చంద్ర శేఖర్ (కోలీవుడ్ స్టార్ విజయ్ తండ్రి)నే తెరకెక్కించడం విశేషం. అంతేకాదు.. రెండు భాషల్లోనూ ఆయనకిదే మొదటి సినిమా కావడం గమనార్హం.
చిరంజీవికి జంటగా మాధవి నటించిన ఈ సినిమాకి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి వద్ద సహాయకులుగా పనిచేసిన కృష్ణ - చక్ర సంగీతమందించారు. పాటల్లో ``చట్టానికి కళ్ళు లేవు తమ్ముడూ`` విశేషాదరణ పొందింది. 1981 అక్టోబర్ 30న విడుదలై ఘనవిజయం సాధించిన `చట్టానికి కళ్ళు లేవు`.. నేటితో 40 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |