![]() |
![]() |

తెలుగునాట కొంతమంది దర్శకులు జయాపజయాలతో సంబంధం లేకుండా.. తమ మొదటి చిత్రం నుండి స్టార్ హీరోలతోనే వరుస సినిమాలు చేసుకుపోతున్నారు. ఇంతకీ అగ్ర కథానాయకులనే లక్ష్యం చేసుకున్న ఆ దర్శకులెవరంటే..
కొరటాల శివః
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన `మిర్చి`తో దర్శకుడిగా తొలి అడుగేసిన కొరటాల శివ.. ఆపై సూపర్ స్టార్ మహేశ్ బాబుతో `శ్రీమంతుడు`, `భరత్ అనే నేను` చేశారు. అలాగే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో `జనతా గ్యారేజ్` తీశారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో `ఆచార్య` చేస్తున్నారు. అదయ్యాక తారక్ తోనే మళ్ళీ మరో భారీ బడ్జెట్ మూవీ చేయబోతున్నారు శివ. మొత్తమ్మీద.. టాప్ స్టార్స్ తోనే కొరటాల ప్రయాణం సాగుతోందన్నమాట.
మెహర్ రమేశ్ః
టాలీవుడ్ లో మెహర్ రమేశ్ ఇప్పటివరకు నాలుగు చిత్రాలు చేశారు. అవన్నీ కూడా స్టార్ హీరోల కాంబినేషన్స్ లోనే రూపొందాయి. ఎన్టీఆర్ తో `కంత్రి`, `శక్తి` చేసిన మెహర్.. ఆ రెండు చిత్రాల నడుమ ప్రభాస్ తో `బిల్లా` తీశారు. ఆపై విక్టరీ వెంకటేశ్ తో `షాడో` చేశారు. లాంగ్ గ్యాప్ తీసుకుని మరీ ప్రస్తుతం చిరుతో `భోళా శంకర్` చేస్తున్నారు.
వంశీ పైడిపల్లిః
ప్రభాస్ నటించిన `మున్నా` కోసం తొలి సారి మెగాఫోన్ పట్టిన వంశీ పైడిపల్లి.. ఆపై తారక్ తో `బృందావనం`, రామ్ చరణ్ - అల్లు అర్జున్ తో `ఎవడు`, కింగ్ నాగార్జునతో `ఊపిరి`, మహేశ్ తో `మహర్షి` చేశారు. త్వరలోనే పట్టాలెక్కనున్న బైలింగ్వల్ మూవీ కోసం కోలీవుడ్ స్టార్ విజయ్ ని డైరెక్ట్ చేయబోతున్నారు.
బాబీః
కె.ఎస్. రవీంద్ర అలియాస్ బాబీ కూడా టాప్ స్టార్స్ తోనే జర్నీ చేస్తున్నారు. తన తొలి చిత్రాన్ని మాస్ మహరాజా రవితేజతో `పవర్`గా రూపొందించిన బాబీ.. ఆపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో `సర్దార్`, ఎన్టీఆర్ తో `జై లవ కుశ`, వెంకటేశ్ టైటిల్ రోల్ లో `వెంకి మామ` చేశారు. రైట్ నౌ చిరంజీవితో ఓ మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నారు.
మరి.. అగ్ర కథానాయకులతోనే జర్నీ చేస్తున్న ఈ టాలెంటెడ్ కెప్టెన్స్.. భవిష్యత్ లోనూ ఇదే తీరున కొనసాగుతారో లేదో చూడాలి.
![]() |
![]() |