![]() |
![]() |

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ నెల 10న జరగనున్న ఈ ఎన్నికల కోసం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్స్ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరి మధ్య మాటల యుద్ధం రాజకీయాలను తలపిస్తుంది. కొందరైతే ఈ ఎన్నికలను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ముడిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి పేర్ని నాని కీలక ప్రకటన చేశారు. ఈ ఎన్నికలతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
'మా' ఎన్నికల్లో సీఎం జగన్ బంధువు మంచు విష్ణు అధ్యక్ష బరిలో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకాష్ రాజ్ కు అని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రస్తుత 'మా' ఎన్నికలు జగన్ వర్సెస్ పవన్ అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో మా ఎన్నికలపై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ ఎన్నికలతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని మంత్రి తెలిపారు. మా ఎన్నికల విషయమై ఏపీ ప్రభుత్వానికి ఏ మాత్రం ఆసక్తి, ఉత్సాహం లేదని.. మా ఎన్నికల్లో ఏ వ్యక్తినీ, వర్గాన్ని మేము సమర్థించటం లేదని పేర్కొన్నారు.
![]() |
![]() |