![]() |
![]() |

రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆరోగ్యంపై కొన్ని రోజుల క్రితం వదంతులు వినిపించాయి. సెప్టెంబర్ నెలలో ప్రమాదవశాత్తు ఇంట్లో కాలుజారి కిందపడిపోగా... చిన్న ఫ్రాక్చర్ అయినట్టు, అపోలో వైద్యులు శస్త్రచికిత్స చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలలో ప్రచారం జరిగింది. అయితే, ఆ వదంతులను కృష్ణంరాజు కార్యాలయ వర్గాలు ఖండించాయి.
రొటీన్ హెల్త్ చెకప్ కోసమే కృష్ణంరాజు అపోలో ఆస్పత్రికి వెళ్లారని, ఆ సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న సాయితేజ్ కుటుంబ సభ్యులతో అతని ఆరోగ్యం గురించి చర్చించారని రెబల్ స్టార్ సన్నిహితులు తెలిపారు. అయితే, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం కృష్ణంరాజు ఆశీర్వాదం తీసుకున్నారు విష్ణు మంచు.
కృష్ణంరాజును ఆయన స్వగృహానికి వెళ్లి విష్ణు మంచు కలిశారు. కృష్ణంరాజు దంపతులతో కలిసి దిగిన ఫోటోను ఇంస్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. అది చూసి కృష్ణంరాజుకు ఏమైందని అభిమానులు చర్చించు కుంటున్నారు. ఫోటోలో రెబల్ స్టార్ నీరసంగా కనిపించారు. బరువు తగ్గడం వల్ల ముఖం పీక్కుపోయినట్టుంది.
![]() |
![]() |