![]() |
![]() |

మెగా కాంపౌండ్ హీరోలకి కలిసొచ్చిన సంగీత దర్శకుల్లో స్వరవాణి కీరవాణి ఒకరు. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ కాంబినేషన్ లో కీరవాణి చేసిన సినిమాలు మంచి విజయం సాధించాయి. ప్రస్తుతం ఆయన అదే కాంపౌండ్ కి చెందిన హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, `ఉప్పెన` ఫేమ్ వైష్ణవ్ తేజ్ తో తొలిసారిగా కలిసి పనిచేస్తున్నారు. పవన్ హీరోగా నటిస్తున్న పిరియడ్ డ్రామా `హరిహర వీరమల్లు`, వైష్ణవ్ నటించిన అడ్వెంచరస్ మూవీ `కొండపొలం`కి కీరవాణే స్వరకర్త. ఈ రెండు సినిమాలకు కూడా వెర్సటైల్ కెప్టెన్ క్రిష్ డైరెక్టర్ కావడం విశేషం.
ఇదిలా ఉంటే.. చరణ్ - కీరవాణి ఫస్ట్ కాంబినేషన్ లో వచ్చిన `మగధీర` ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. `చిరుత` వంటి బ్లాక్ బస్టర్ డెబ్యూ తరువాత చరణ్ నటించిన రెండో సినిమా అయిన `మగధీర` అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. కట్ చేస్తే.. ఇప్పుడు వైష్ణవ్ - కీరవాణి తొలి కాంబినేషన్ లో వస్తున్న `కొండ పొలం` కూడా వైష్ణవ్ కి రెండో చిత్రం. మరి.. `ఉప్పెన` వంటి బ్లాక్ బస్టర్ డెబ్యూ తరువాత వస్తున్న `కొండ పొలం`తో.. కీరవాణి బాణీల సమేతంగా `మగధీర` లాంటి సెన్సేషనల్ హిట్ ని వైష్ణవ్ తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.
![]() |
![]() |