![]() |
![]() |

క్రిష్ జాగర్లమూడిలో దర్శకుడు మాత్రమే కాదు, నిర్మాత కూడా ఉన్నారు. స్నేహితుడు రాజీవ్ రెడ్డితో కలిసి ఇతరుల దర్శకత్వంలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, సీరియళ్లు నిర్మిస్తూ ఉంటాడు. ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కోసం ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. దానికి 'తొమ్మిది గంటలు' అనే టైటిల్ ఖరారు చేశారు. త్వరలో ఇది విడుదల కానుంది. భవిష్యత్తులో మరిన్ని వెబ్ సిరీస్‌లు చేయాలని ఉందని క్రిష్ తెలిపారు.
క్రిష్ వెబ్ సిరీస్ తీయడం తొలిసారి కాదు. గతంలో ఆహా కోసం 'మస్తీస్' అని ఒక వెబ్ సిరీస్ నిర్మించారు. దానికి మంచి స్పందన లభించింది. ప్రస్తుతం ఓటీటీకి ఆదరణ బాగుండడంతో నిర్మాతగా వెబ్ సిరీస్ లు చేస్తున్నారన్నమాట. ఈటీవీ కోసం క్రిష్ తండ్రి సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి కలిసి 'పుత్తడి బొమ్మ', 'స్వాతి చినుకులు', 'తేనే మనసులు', 'కాంచన మాల' తదితర సీరియళ్లు నిర్మించారు.
![]() |
![]() |