![]() |
![]() |

గోపీచంద్, నయనతార జంటగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆరడుగుల బుల్లెట్'. ఎప్పుడో 2017 లో విడుదల కావాల్సిన ఈ మూవీ ఫైనాన్షియల్ కారణాల వల్ల ఇంతవరకు విడుదల కాలేదు. అయితే ఇప్పుడు ఆ అడ్డంకులు తొలిగిపోవడంతో ఎట్టకేలకు ఇన్నాళ్లకు మోక్షం కలిగింది. ఈ సినిమా అక్టోబర్ 8 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ తాజాగా ట్రైలర్ ను విడుదల చేసింది.
సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన 'సీటిమార్' సినిమాతో ఇటీవల ప్రేక్షకులను అలరించాడు గోపీచంద్. ఈ హిట్ జోష్ లో ఉన్న గోపీచంద్ 'ఆరడుగుల బుల్లెట్' సినిమాతో ఇప్పుడు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర వంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన గోపాల్.. మాస్ హీరో గోపీచంద్ తో తీసిన సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. ట్రైలర్ కూడా కమర్షియల్ ఎలెమెంట్స్ తో ఆకట్టుకునేలా ఉంది. గోపీచంద్ స్క్రీన్ ప్రెజెన్స్, మణిశర్మ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కాగా, నాలుగేళ్ల క్రితం విడుదల కావాల్సిన సినిమా ఇప్పుడు విడుదల అవుతుండటంతో.. 'ఆరడుగుల బుల్లెట్'పై ప్రేక్షకులు ఎంతవరకు ఆసక్తి కనబరుస్తారో చూడాలి.
![]() |
![]() |