![]() |
![]() |

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో ఓ బైలింగ్వెల్ మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో సాగుతుంది. అయితే ఇప్పుడు అనుకోకుండా ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ఓ రేంజ్ హిట్ అందుకొని మాస్ కి బాగా దగ్గరయ్యాడు రామ్. అప్పటి నుండి మాస్ సినిమాల వైపు మొగ్గు చూపుతున్న రామ్.. ఆ తర్వాత 'రెడ్' సినిమాతో అలరించాడు. ఇప్పుడు లింగుసామి దర్శకత్వంలో ఊర మాస్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం రామ్ ఎంతగానో కష్టపడుతున్నారు. లుక్ మార్చుకోవడంతో పాటు బాడీ కోసం కసరత్తులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన మెడకు గాయమైంది. దీంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. రామ్ మెడకు బ్యాండేజ్ ఉన్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కాగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ కి జోడీగా కృతి శెట్టి నటిస్తోంది.
![]() |
![]() |