![]() |
![]() |

దర్శకుడిగా కొరటాల శివ ఇప్పటివరకు నాలుగు చిత్రాలతో సందడి చేశారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి - మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో తన ఐదో సినిమా `ఆచార్య` చేస్తున్నారాయన. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ సోషల్ డ్రామా.. త్వరలోనే థియేటర్స్ లో సందడి చేయనుంది. ఆపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో ఓ పాన్ - ఇండియా మూవీ చేయబోతున్నారు కొరటాల. `జనతా గ్యారేజ్` (2016) వంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో.. తారక్ - కొరటాల సెకండ్ జాయింట్ వెంచర్ పై సహజంగానే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
కాగా, జూనియర్ ఎన్టీఆర్ కంటే ముందు సూపర్ స్టార్ మహేశ్ బాబుతో మాత్రమే రెండు సినిమాలు చేశారు కొరటాల. `శ్రీమంతుడు` (2015), `భరత్ అనే నేను` (2018).. ఇలా మహేశ్ తో చేసిన రెండు చిత్రాలతోనూ మంచి విజయాలు అందుకున్నారు శివ. మరి.. మహేశ్ తరువాత మళ్ళీ తారక్ తోనే రెండో ప్రయత్నం చేస్తున్న కొరటాల.. యంగ్ టైగర్ తోనూ సెకండ్ ఎటెంప్ట్ లో గ్రాండ్ సక్సెస్ చూస్తారేమో చూడాలి. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. మహేశ్ తో చేసిన రెండో చిత్రం `భరత్ అనే నేను` తరహాలోనే తారక్ తో చేయబోతున్న రెండో సినిమా కూడా సమ్మర్ సీజన్ లోనే రిలీజ్ కానుంది. తారక్ తోనూ ఆ మ్యాజిక్ రిపీట్ అయితే.. కొరటాల ఖాతాలో తొలి పాన్ - ఇండియా హిట్ పక్కా అన్నమాట. చూద్దాం.. ఏం జరుగుతుందో!
![]() |
![]() |