![]() |
![]() |

అక్కినేని కుటుంబంలో మూడో తరం కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన యువ సామ్రాట్ నాగచైతన్య.. రెండో సినిమా `ఏమాయ చేసావె`తోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆపై `100% లవ్`, `తడాఖా`, `మనం`, `ప్రేమమ్`, `రారండోయ్ వేడుక చూద్దాం`, `మజిలీ`, `వెంకిమామ` రూపంలో మరిన్ని హిట్స్ చూశాడు. ఇక రీసెంట్ గా విడుదలైన `లవ్ స్టోరి` కూడా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. తొలి వారాంతంలో వసూళ్ళ వర్షం కురిపించింది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు ఐకానిక్ మూవీస్ రిలీజ్ డేట్స్ చైతూకి భలే కలిసొస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. నాగచైతన్య కెరీర్ లో తొలి సక్సెస్ అయిన `ఏమాయ చేసావె` (2010).. తెలుగు ఇండస్ట్రీకి తొలి సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ అయిన ఏయన్నార్ క్లాసిక్ `బాలరాజు` (1948) విడుదలైన ఫిబ్రవరి 26నే జనం ముందుకొచ్చింది. అలాగే `100% లవ్` తరువాత ట్రాక్ తప్పిన చైతూకి చెప్పుకోదగ్గ విజయం ఇచ్చిన `తడాఖా` (2013) కూడా ఏయన్నార్ మరో ఐకానిక్ మూవీ `సువర్ణ సుందరి` (1957) రిలీజైన మే 10న విడుదలైంది. ఇక నాగచైతన్య రీసెంట్ హిట్ `లవ్ స్టోరి` సంగతి తీసుకుంటే.. అక్కినేని నాగేశ్వరరావు ఆల్ టైమ్ క్లాసిక్ `ప్రేమనగర్` (1971) విడుదలైన సరిగ్గా 50 ఏళ్ళ తరువాత అదే రోజున ప్రేక్షకుల ముందుకొచ్చింది.
మొత్తంగా.. తాతయ్య ఏయన్నార్ ఐకానిక్ మూవీస్ రిలీజ్ డేట్స్.. నాగచైతన్యకి భలేగా అచ్చొస్తున్నాయన్నమాట. మరి.. భవిష్యత్ లోనూ ఇదే పరంపర కొనసాగుతుందేమో చూడాలి.
![]() |
![]() |