![]() |
![]() |

మైత్రీ మూవీ మేకర్స్ కి మెగా కాంపౌండ్ హీరోలు భలేగా అచ్చొచ్చారు. ఈ క్యాంప్ లో తొలి ప్రయత్నంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేసిన`రంగస్థలం`.. మైత్రీకి సెన్సేషనల్ హిట్ ని అందించింది. ఆపై `సుప్రీమ్` హీరో సాయితేజ్ తో చేసిన `చిత్రలహరి` కూడా మంచి ఫలితాన్ని అందించింది. అలాగే సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ తో చేసిన `ఉప్పెన` కూడా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ మూడు సినిమాలకు కూడా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ నే బాణీలు అందించారు.
అంతేకాదు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ప్రస్తుతం చేస్తున్న `పుష్ప`, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో చేయబోతున్న `భవదీయుడు..! భగత్ సింగ్`తో పాటు మెగాస్టార్ చిరంజీవి 154 (బాబీ డైరెక్టోరియల్)కి కూడా డీఎస్పీనే సంగీత దర్శకుడు. మొత్తమ్మీద.. మెగా కాంపౌండ్ లో ఏ హీరోతో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా చేసినా కామన్ ఫ్యాక్టర్ మాత్రం డీఎస్పీ మ్యూజిక్ అనే చెప్పాలి. మరి.. మున్ముందు కూడా ఇదే శైలి కొనసాగుతుందేమో చూడాలి.
కొసమెరుపు ఏమిటంటే.. మైత్రీ సంస్థ మెగా క్యాంప్ హీరోలతో కాకుండా మిగిలిన స్టార్స్ తో సినిమాలు నిర్మించే సందర్భంలో మాత్రం దేవి శ్రీ ప్రసాద్ తో పాటు కీరవాణి, తమన్, అనిరుధ్ వంటి సంగీత దర్శకులు స్వరాలు సమకూర్చుతున్నారు.
![]() |
![]() |