![]() |
![]() |

సూపర్ స్టార్ రజినీకాంత్ సాలిడ్ హిట్ చూసి చాన్నాళ్ళే అయింది. అప్పుడెప్పుడో పదకొండేళ్ళ క్రితం విడుదలైన `ఎందిరన్` (రోబో) (2010)తో చివరిసారిగా బ్లాక్ బస్టర్ కొట్టిన రజినీ.. మళ్ళీ తన స్థాయి సక్సెస్ ని అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో.. రాబోయే చిత్రం `అణ్ణాత్త`పైనే ఆశలు పెట్టుకున్నారాయన. `శౌర్యం` శివ డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ డ్రామా.. దీపావళి కానుకగా నవంబర్ 4న థియేటర్స్ లో సందడి చేయనుంది. తెలుగులోనూ ఈ సినిమా అనువాద రూపంలో అలరించనుంది.
ఇదిలా ఉంటే.. దీపావళి సీజన్ సూపర్ స్టార్ కి అచ్చొచ్చిన సీజన్ అనే చెప్పాలి. గత మూడు దశాబ్దాల కాలంలో `దళపతి` (1991), `ముత్తు` (1995) వంటి సెన్సేషనల్ హిట్స్ ఈ సీజన్ లోనే అందుకున్నారు రజినీకాంత్. అలాంటి లక్కీ సీజన్ లో రజినీ నుంచి దాదాపు 26 ఏళ్ళ తరువాత వస్తున్న దీపావళి సినిమా `అణ్ణాత్త`నే కావడం విశేషం. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. `ముత్తు`లో రజినీ సరసన ఆడిపాడిన సీనియర్ హీరోయిన్ మీనా.. `అణ్ణాత్త`లోనూ ఓ ముఖ్య పాత్రలో దర్శనమివ్వనుంది. మరి.. `ముత్తు` తరువాత దీపావళి సీజన్ లో వస్తున్న `అణ్ణాత్త`తో.. రజినీ మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి.
![]() |
![]() |