![]() |
![]() |

అవును... సోషల్ మీడియా అకౌంట్స్‌లో సమంత పేరు మారింది. సారీ సారీ... స్వయంగా సమంతే పేరు మార్చుకుంది. మళ్ళీ సమంత అని రాసుకున్నారు. దాంతో నాగచైతన్యతో విడిపోవాలని డెసిషన్ తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో పేరును మార్చిందని మరోసారి క్లారిటీ వచ్చింది.
పెళ్లి తర్వాత అక్కినేని ఇంటిపేరును తన పేరు చివర సమంత పెట్టుకున్నారు. సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్లు అయిన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో సమంత అక్కినేని అని రాసుకుంది. అయితే, కొన్ని రోజుల క్రితం ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అక్కినేని పేరు తీసేశారు. తన పేరు కూడా తీసేసి... కేవలం 'ఎస్' అని రాసుకొచ్చారు. అప్పుడే చాలామందికి సందేహాలు మొదలయ్యాయి. అవి నిజమని నిన్నటి ప్రకటనతో తెలిసింది. నాగచైతన్యతో పాటు సమంత కూడా తాము విడిపోతున్నట్టు ప్రకటించారు.
విడిపోయామని ప్రకటించిన మరుసటి రోజే ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో మళ్ళీ సమంత పేరు మారింది. ఎస్ అక్షరం తీసేసి సమంత అని రాసుకున్నారు. అయితే, ఫేస్‌బుక్‌లో మాత్రం సమంత అక్కినేని ఉండటం గమనార్హం.
![]() |
![]() |