![]() |
![]() |
.jpg)
బైక్ యాక్సిడెంట్ తర్వాత నుండి యంగ్ హీరో సాయితేజ్ అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అతడు కోలుకుంటున్నారని సన్నిహితులు అందరూ చెబుతున్నారు. అయితే, అతడికి ఏం చికిత్స అందిస్తున్నారు? ఏమిటి? అనే వివరాలు మాత్రం చెప్పడం లేదు. అందువల్ల, సాయితేజ్‌కు ఎలా ఉందో తెలుసుకోవాలని ప్రేక్షకుల్లో కుతూహలం ఉంది. తాజాగా సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ క్లారిటీ ఇచ్చాడు.
"అన్నయ్య ఆరోగ్యం బావుంది. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఇప్పుడు ఫిజియో థెరపీ అందిస్తున్నారు. ఓ వారంలో ఇంటికి రావచ్చు" అని వైష్ణవ్ తేజ్ చెప్పాడు. దాంతో త్వరలో సాయి తేజ్ డిశ్చార్జ్ కావచ్చని తెలుస్తోంది. ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చిన తర్వాత కూడా సాయి తేజ్ బయటకు రావడానికి వీలు లేదు. కనీసం రెండు మూడు నెలలు పూర్తి విశ్రాంతి అవసరమని, అప్పుడే పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారట.
![]() |
![]() |