Home  »  News  »  అక్కినేని ఫ్యామిలీ డబ్బును సమంత వద్దనుకుందా?

Updated : Oct 3, 2021

సమంతకు అక్కినేని ఫ్యామిలీ ఎన్ని కోట్లు ఇచ్చింది? భరణంగా ఆమెకు ఎంత లభించింది? నాగచైతన్య, సమంత తాము విడిపోతున్నామని ప్రకటించిన తర్వాత కొందరి మధ్య ఈ చర్చ వచ్చినమాట వాస్తవం. అసలు, విడిపోతారనే వార్తలు వచ్చినప్పటి నుండి భరణం విషయంలో చర్చ జరుగుతోంది. సమంతకు వంద నుండి రెండొందల కోట్ల రూపాయలు అందే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వాసులు చెవులు కోరుకున్నారు.

ఇటు అక్కినేని... అటు దగ్గుబాటి... తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెండు బలమైన కుటుంబాల వారసత్వం నాగచైతన్యకు ఉంది. కుటుంబ వారసత్వంగా వచ్చిన ఆస్తి తక్కువేం కాదు. అందుకని, కనీసం వంద కోట్లు సమంతకు భరణంగా అందుతాయని లెక్క కట్టారు. అయితే, ఇక్కడ మరో విషయం కూడా వినబడుతోంది. 'శ్రీనివాస కళ్యాణం' సినిమాలో హీరోయిన్ తండ్రి ప్రీ-మ్యారిటల్ అగ్రిమెంట్ ప్రతిపాదన ఒకటి తీసుకొస్తాడు... గుర్తుందా? అటువంటి అగ్రిమెంట్ నాగచైతన్య-సమంత పెళ్ళికి ముందు చేసుకున్నారని, ఆమెకు ఎటువంటి భరణం అందదని మరో టాక్. 

అక్కినేని ఫ్యామిలీ ఇస్తానన్న డబ్బును సమంత వద్దని అన్నదని ఆమె సన్నిహితులు చెప్పే మాట. సమంత ప్రేమను మాత్రమే కోరుకున్నదని, డబ్బును కాదని వారు చెబుతున్నారు. విడాకులు పూర్తిగా వ్యక్తిగత విషయం. కాకపోతే ఇక్కడ విడాకులు తీసుకున్నది సెలబ్రిటీ కపుల్ కాబట్టి జనాల్లో ఆసక్తి ఎక్కువ ఉంది. ఇప్పటివరకు ఇండియాలో సెలబ్రిటీ కపుల్ విడాకులు తీసుకున్న సమయంలో భరణం విషయం బయటకు రాలేదు. సో... చై-సామ్ లెక్కలు కూడా రాకపోవచ్చు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.