![]() |
![]() |

ఎ.ఎం. రత్నం.. పరిచయవాక్యాలు అక్కర్లేని పేరు. ఒక దశలో వరుస విజయాలతో సంచలనం సృష్టించిన ఈ అగ్ర నిర్మాత.. ఈ మధ్య సినిమాల సంఖ్య తగ్గించారు. స్వల్ప విరామం అనంతరం రత్నం మరో తెలుగు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ సినిమానే.. `హరిహర వీరమల్లు`. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈ పిరియడ్ డ్రామాని వెర్సటైల్ కెప్టెన్ క్రిష్ రూపొందిస్తున్నారు. 2022 వేసవి కానుకగా ఏప్రిల్ 29న ఈ భారీ బడ్జెట్ మూవీని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. పవన్ తో ఎ.ఎం. రత్నం ఇదివరకు రెండు సినిమాలు నిర్మించగా.. అవి కూడా సమ్మర్ సీజన్ లోనే సందడి చేశాయి. పవన్, రత్నం ఫస్ట్ కాంబినేషన్ లో వచ్చిన `ఖుషి` 2001 ఏప్రిల్ 27న రిలీజ్ కాగా.. సెకండ్ జాయింట్ వెంచర్ `బంగారం` 2006 మే 3న విడుదలైంది. కట్ చేస్తే.. ఇప్పుడు మూడో సినిమా `హరిహర వీరమల్లు` కూడా వేసవిలోనే వినోదాలు పంచేందుకు సిద్ధమవుతుండడం విశేషం. మరి.. `ఖుషి` తరహాలో ఏప్రిల్ నెలాఖరులోనే విడుదలవుతున్న `హరిహర వీరమల్లు` కూడా బాక్సాఫీస్ సెన్సేషన్ గా నిలుస్తుందేమో చూడాలి
![]() |
![]() |