![]() |
![]() |

మెగా హీరో సాయిధరమ్ తేజ్ హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్ వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా స్ఫృహలోకి వచ్చిన సాయితేజ్ కుటుంబ సభ్యులతో ఒకే ఒక్క మాట మాట్లాడినట్లుగా తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే స్పృహ కోల్పోయిన సాయితేజ్.. ఈరోజు ఉదయం స్పృహలోకి వచ్చారు. దీంతో మధ్యాహ్నం సాయితేజ్ ను వీడియో కాల్ ద్వారా కుటుంబసభ్యులతో మాట్లాడించే ప్రయత్నం చేశారు వైద్యులు. ఈ సందర్భంగా 'నొప్పిగా ఉంది' అంటూ సాయితేజ్ ఒకే ఒక్క మాట మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఆ ఒక్క మాట మినహా ఆయన మరేం మాట్లాడలేదని.. మాట్లాడే పరిస్థితిలో ఆయన లేరని డాక్టర్లు చెబుతున్నారు.
సాయితేజ్ దగ్గరకు కుటుంబసభ్యులను కూడా డాక్టర్లు అనుమతించడం లేదని తెలుస్తోంది. కేవలం వీడియో కాల్ ద్వారానే సాయితేజ్ ని కుటుంబ సభ్యులకు డాక్టర్లు చూపిస్తున్నారని సమాచారం.
![]() |
![]() |