![]() |
![]() |

టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య, సమంత కొన్ని రోజులుగా మీడియా, సోషల్ మీడియా దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నారు. కారణం చాలా మందికి తెలిసిందే.. వాళ్ల కాపురంలో కలహాలు చెలరేగాయనీ, త్వరలోనే వారు విడిపోనున్నారనీ విరివిగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ నెగటివిటీకి దూరంగా ఆ ఇద్దరూ తమ పనేదో తాము చేసుకుపోతున్నారు. జరుగుతున్న ప్రచారంపై ఆ ఇద్దరూ కానీ, వారి కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరు కానీ ఇంతదాకా స్పందించలేదు. అందరూ మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఆ ఇద్దరి మధ్య తలెత్తిన భేదాభిప్రాయలు, పొరపొచ్చాలు తొలగిపోయాయి.. ఇద్దరూ మళ్లీ యథాప్రకారం ప్రేమగా ఉంటున్నారు.
లేటెస్ట్‌గా తమ ఫ్యామిలీలోకి కొత్త మెంబర్‌ను ఆహ్వానించింది సమంత. ఆ మెంబర్‌ను తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పరిచయం చేసింది సమంత. ఆ మెంబర్ ఒక పప్పీ డాగ్. దాని పేరు సాషా అని తన పోస్ట్ ద్వారా వెల్లడించింది. ఇప్పటికే చైతూ, సమంత దగ్గర హ్యాష్ అనే పెట్ డాగ్ ఉన్న విషయం తెలిసింది. చూస్తుంటే.. సమంతకు కుక్కలంటే పిచ్చి ప్రేమలా కనిపిస్తోంది. తన కొత్త బుల్లి కుక్కపిల్ల సాషా ఫొటోలను రెండింటిని షేర్ చేసిన సమంత, “Cleaned the 19th puddle of pee today and it’s only 9 am..but the cherry on the cake has to be the moment that I sat down with my coffee thinking ha!! 5 minutes of calm now..only to notice one tiny little monster running with her dripping pee pad all around the house..and suddenly my coffee isn’t strong enough. Say hello to SAASHA #pitbullsofinstagram #HashandSaasha #brotherandsister #itsgoingtobeaparty. (sic)” అని రాసుకొచ్చింది.

అమల అక్కినేని తరహాలోనే సమంత కూడా జంతు ప్రేమికురాలు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ చూస్తే ఈ విషయం మనకు బాగా తెలుస్తుంది. సమంత పోస్ట్ చేసిన ఓ ఫొటోలో సాషాను సమంత ఒళ్లో పెట్టుకొని కూర్చొని, దాన్ని ముద్దు చేస్తుంటే, పక్కనే కూర్చున్న హ్యాష్ ముఖంలో అసూయ తొంగిచూస్తోంది.
.jpg)
పని విషయానికి వస్తే, ఇటీవలే గుణశేఖర్ పౌరాణిక చిత్రం 'శాకుంతలం'ను పూర్తిచేసింది సమంత. ప్రస్తుతం నయనతార, విజయ్ సేతుపతితో కలిసి విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో 'కాదు వాకుల రెండు కాదల్' మూవీని చేస్తోంది.
![]() |
![]() |