![]() |
![]() |

వైవిధ్యభరితమైన చిత్రాలతో ముందుకు సాగుతున్న తమిళ దర్శకుడు వెట్రిమారన్. `ఆడుగలమ్`, `విసారణై`, `వడ చెన్నై`, `అసురన్` వంటి సినిమాలతో కోలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడీ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్. ప్రస్తుతం `విడుదలై`, `వాడివాసల్` చిత్రాలతో బిజీగా ఉన్న వెట్రిమారన్.. త్వరలో ఓ తెలుగు సినిమా చేయబోతున్నాడట.
ఆ వివరాల్లోకి వెళితే.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కోసం ఇటీవల వెట్రిమారన్ ఓ సబ్జెక్ట్ రెడీ చేసుకున్నాడట. అంతేకాదు.. తారక్ తో సంప్రదింపులు కూడా జరిపాడని సమాచారం. కథ, పాత్ర నచ్చడంతో ఎన్టీఆర్ కూడా ఈ సినిమా చేసేందుకు ఆసక్తి చూపించినట్లు బజ్. అంతేకాదు.. పాన్ - ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్ మూవీని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించబోతోందని టాక్. త్వరలోనే తారక్, వెట్రిమారన్ కాంబో మూవీపై క్లారిటీ రానుంది.
కాగా, తారక్ తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` చిత్రీకరణ పూర్తిచేసుకుంది. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మరో మూవీ చేయబోతున్నాడు. ఆ చిత్రాలు పూర్తయ్యాకే వెట్రిమారన్ కాంబినేషన్ మూవీ పట్టాలెక్కే అవకాశముందంటున్నారు.
![]() |
![]() |