![]() |
![]() |

`భరత్ అనే నేను`, `మహర్షి`, `సరిలేరు నీకెవ్వరు` వంటి హ్యాట్రిక్ హిట్స్ తరువాత సూపర్ స్టార్ మహేశ్ బాబు నుంచి రాబోతున్న సినిమా `సర్కారు వారి పాట`. గత మూడు చిత్రాల్లో కియారా అద్వాని, పూజా హెగ్డే, రష్మిక మందన్నా.. ఇలా ఫ్రెష్ జోడీలతోనే కనువిందు చేసిన ఈ ఘట్టమనేని వారి హ్యాండ్సమ్ హీరో.. `సర్కారు వారి పాట`లోనూ ఆ పరంపరని కొనసాగిస్తూ కీర్తి సురేశ్ కాంబినేషన్ లో తొలిసారిగా ఎంటర్టైన్ చేయనున్నారు. మహేశ్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేసిన బర్త్ డే బ్లాస్టర్ లో కీర్తితో కెమిస్ట్రీ సదరు ప్రచార చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. సినిమాలో అంతకుమించి వీరి మధ్య సన్నివేశాలు ఉండబోతున్నట్లు సమాచారం.

లేటెస్ట్ బజ్ ఏంటంటే.. కొద్ది రోజుల క్రితం మహేశ్, కీర్తిపై ఓ వెడ్డింగ్ సీన్ షూట్ చేశారట దర్శకుడు పరశురామ్. భారీ సెట్స్ నడుమ చిత్రీకరించిన ఈ సన్నివేశం.. సినిమాకి ఓ ప్రత్యేక ఆకర్షణ కానుందట. అంతేకాదు.. మహేశ్ `మురారి`(2001)లో పెళ్ళి పాట ఎలాగైతే చిరస్థాయిగా నిలిచిపోయిందో అలా ఈ వెడ్డింగ్ సీన్ కూడా ఉండబోతోందని ఇన్ సైడ్ టాక్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, సంక్రాంతి కానుకగా 2022 జనవరి 13న `సర్కారు వారి పాట` థియేటర్స్ లో సందడి చేయనుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నాడు.
![]() |
![]() |