![]() |
![]() |

'బిగ్ బాస్' షో తెలుగు ఐదో సీజన్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. నాగార్జున హోస్ట్ గా 19 మంది కంటెస్టెంట్స్ తో సెప్టెంబర్ 5 న స్టార్ట్ అయిన ఈ షో అలరిస్తోంది. ఇక షో కంటెస్టెంట్స్ లో ఒకరైన మానస్ నాగులపల్లి.. ఓ వైపు ఈ షోతో అలరిస్తూనే మరోవైపు 'క్షీర సాగర మథనం' అనే మూవీతో ఆకట్టుకుంటున్నాడు.
బిగ్ బాస్ ఫేమ్ మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా అనిల్ పంగులూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'క్షీర సాగర మథనం'. ఈ చిత్రం ఆగస్టు 6న థియేటర్స్ లో విడుదలై మెప్పించింది. ఈ మూవీ ఇటీవల ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాగా అసాధారణ స్పందన లభిస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో 499వ తెలుగు చిత్రంగా విడుదలైన 'క్షీరసాగర మథనం' నాలుగు రోజుల స్వల్ప వ్యవధిలోనే 'టాప్ 25'లో చోటు సంపాదించుకుని.. మరింత మెరుగైన స్థానం కోసం పోటీ పడుతోంది.
'క్షీరసాగర మథనం' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ నిర్మించింది. తమ చిత్రానికి అమెజాన్ ప్రైమ్ లో లభిస్తున్న అపూర్వ స్పందన తమను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోందని దర్శకుడు అనిల్ పంగులూరి అంటున్నారు. ఈ విజయోత్సాహంతో ఆయన తన తదుపరి చిత్రం కోసం సన్నాహాలు చేసుకుంటున్నారని.. అతి త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.
![]() |
![]() |