![]() |
![]() |

ఇటీవల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి తన ప్యానల్‌ను ప్రకటించారు ప్రకాశ్‌రాజ్. వచ్చే నెలలో జరగనున్న 'మా' ఎలక్షన్లలో ఆయన ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్నారు. ప్యానల్‌ను ప్రకటించే సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తిని కలిగించాయి. "'మా' బిల్డింగ్‌ను ఒక్కడ్నే కట్టేంత డబ్బు నా దగ్గర లేదు. నేను చాలా స్మాల్ ఆర్టిస్టును." అని ఆయన అన్నారు. అదివరకు 'మా' బిల్డింగ్‌ను తన సొంత డబ్బులతో కట్టించి ఇస్తానని ప్రెసిడెంట్ రేసులో ఉన్న మంచు విష్ణు ప్రకటించి వున్నారు. దానికి సంబంధించి మీడియా ప్రతినిధుల నుంచి ప్రశ్న ఎదురైనప్పుడు ప్రకాశ్‌రాజ్ చెప్పిన మాటలవి.
నిజానికి ఆయన అంత స్మాల్ ఆర్టిస్టా? ఆయన దగ్గర అంత డబ్బు లేదా? అనే ప్రశ్న వేసుకుంటే.. నిజానికి ఆయన చాలామంది ఆర్టిస్టుల కంటే చాలా రిచ్ అనే చెప్పాలి. 2019లో బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ స్థానానికి పోటీ చేసినప్పుడు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన దగ్గర రూ. 36 కోట్ల విలువైన ఆస్తులున్నాయి! ఆయన సంవత్సరాదాయం రూ. 2.5 కోట్ల నుంచి రూ. 3 కోట్ల దాకా ఉంటుందని అంచనా. ఆయన బహుభాషా నటుడు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో బిజీ ఆర్టిస్ట్. ఇటు విలన్ పాత్రలతో, అటు ఇతర ప్రధాన పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వస్తున్న నటుడు. ఆ విషయంలో ఎవరికీ డౌట్లు లేవు. క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న నటుల్లో ఒకరిగా ఆయన పేరు పొందారు. అంతే కాదు, ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా ఆయన సంపాదిస్తున్నారు.
ఆయన దగ్గర డబ్బులు లేకపోతే ఇటు తెలంగాణలో ఒక గ్రామం, అటు కర్నాటకలో ఒక గ్రామం ఎలా దత్తత తీసుకొని, వాటిని డెవలప్ చేస్తున్నారనే ప్రశ్న వస్తుంది. ముంబై ఏరియాలో ఆయనకు ఖరీదైన ఇల్లు, చెన్నైలో ఒక ఫామ్ హౌస్ ఉన్నాయి. సో.. ఏదో మాటవరసకి తను స్మాల్ ఆర్టిస్టుననీ, మా బిల్డింగ్‌ను ఒక్కడ్నే కట్టేంత డబ్బు తన దగ్గర లేదనీ ఆయన అన్నారని మనం అనుకోవచ్చు. ఆయన మనసు పెట్టాలే కానీ, మా బిల్డింగ్‌ను ఆయన ఈజీగా కట్టేయగలరు!
![]() |
![]() |