![]() |
![]() |

నెల రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో సమంత, నాగచైతన్య విడిపోతున్నారా? అంటూ ఒకటే చర్చ నడుస్తోంది. అక్కినేని అనే ఇంటిపేరును తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి సమంత తొలగించడం ఈ అనుమానాలకు తావిచ్చింది. టాలీవుడ్‌లోని అత్యంత అందమైన జంటల్లో ఒకటిగా గుర్తింపు పొందిన చైతూ-సమంత కొన్నేళ్లపాటు ప్రేమించుకొని, 2017లో దంపతులుగా మారారు. అయితే ఇటీవల ఆ ఇద్దరి మధ్యా కలతలు రేగిన మాట వాస్తవమేననేది అంతర్గత వర్గాల నుంచి వచ్చిన సమాచారం. అయితే ఆ కలతలు విడిపోయేంత తీవ్రమైనవి కావనీ, నాగార్జున చొరవతో ఆ ఇద్దరి మధ్యా సర్దుబాటు జరిగిందనీ ఆ వర్గాలు అంటున్నాయి.
పెళ్లయిన దగ్గర్నుంచీ ఎంతో అన్యోన్యంగా ఉంటూ వస్తున్న 'చైసామ్' జోడీ గోవాలో ఇల్లు కూడా కట్టుకున్నారు. త్వరలో ఆ ఇంటిలోకి వెళ్లాలని ప్లాన్ కూడా చేసుకున్నారు. ఈలోగా ఇద్దరి మధ్యా పిల్లలు కనడం గురించి వాగ్వాదం జరిగిందనేది విశ్వసనీయ సమాచారం. పిల్లలు కనడానికి ఇదే సరైన సమయమని చైతూ, మరికొంత కాలం ఆగుదామని సమంత వాదించుకున్నారని అంటున్నారు. ఇద్దరూ పట్టువిడవక పోవడం వల్లే సమస్య జటిలమైంది. విషయం తెలిసిన నాగార్జున ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడారు. నాగ్ కూడా సమంతను కన్విన్స్‌ను చేశారని తెలుస్తోంది.
చివరకు సమంత మెత్తబడిందనీ, ప్రస్తుతం చేస్తున్న సినిమాలను పూర్తిచేసి, రెండేళ్లపాటు నటనకు విరామం ఇవ్వడానికి సరేనన్నదనీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే గుణశేఖర్ డైరెక్ట్ చేస్తోన్న 'శాకుంతలం' సినిమాని కంప్లీట్ చేసిన సమంత, త్వరలోనే విఘ్నేశ్ శివన్ డైరెక్ట్ చేస్తోన్న తమిళ చిత్రం 'కాదు వాకుల రెండు కాదల్' సినిమానీ పూర్తి చేయనున్నది. ఈ మూవీలో ఆమెతో పాటు నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
అందిన సమాచారం ప్రకారమైతే, 'కాదు వాకుల రెండు కాదల్' మూవీ తర్వాత సమంత మరే సినిమానీ ఒప్పుకోకపోవచ్చు. ఒక సంతానాన్ని కని, ఆ తర్వాత వీలు చూసుకొని, మళ్లీ నటించవచ్చని అనుకుంటున్నారు. ఇందుకు చైతన్య కూడా సరేనన్నాడంట. వచ్చే నెల 6న వారి నాలుగో పెళ్లి వార్షికోత్సవం. అప్పటికి వారి వ్యవహారంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
![]() |
![]() |