![]() |
![]() |

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్ కు సంబంధించి సినీ ప్రముఖులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారిస్తోన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా తాజాగా హీరో రవితేజ ఈడీ విచారణకు హాజరయ్యారు.
రవితేజ, ఆయన వ్యక్తిగత డ్రైవర్ శ్రీనివాస్ గురువారం ఉదయం ఈడీ విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్ కోణంలో రవితేజకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. కెల్విన్ నుంచి శ్రీనివాస్ కు డ్రగ్స్ అందాయని ఈడీ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌కు సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జరిగాయన్న విషయంతోపాటు ఎఫ్‌క్లబ్ గురించి కూడా సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా డ్రగ్స్ కేసులో సినీరంగానికి చెందిన 12మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పూరీ జగన్నాథ్, ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రానా, నందు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈరోజు ఉదయం రవితేజ, ఆయన డ్రైవర్ శ్రీనివాస్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే అక్కడ కవరేజ్ కోసం సిద్ధంగా ఉన్న మీడియాను చూసి రవితేజ పరుగులు పెడుతూ ఈడీ కార్యాలయంలోకి వెళ్ళారని తెలుస్తోంది.
![]() |
![]() |