![]() |
![]() |
.jpg)
సినిమా టికెట్స్ ఆన్ లైన్ బుకింగ్ కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తాజాగా జీవోను విడుదల చేసింది.
ఇటీవల సినిమా టికెట్ రేట్లను నియంత్రిస్తూ చర్యలు తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థపై ఫోకస్ పెట్టింది. ఆన్ లైన్ బుకింగ్ పేరుతో మధ్యవర్తులు భారీ మొత్తాలను వసూల్ చేస్తున్నారు. సర్వీస్ ఛార్జీల పేరుతో టికెట్ కు పది నుండి ఇరవై రూపాయల వరకూ అదనంగా దోచుకుంటున్నారు. అందుకే టికెట్ ధరల విషయంలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు త్వరలోనే పోర్టల్‌ను ప్రారంభించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జగన్ సర్కార్ జీవోను విడుదల చేసింది.

సినిమా టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ కోసం పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షనుంది. అలాగే విధి-విధానాలు, అమలు ప్రక్రియను చూసుకోవడానికి ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది.
కాగా, నిజానికి ఇలాంటి వ్యవ్యస్థను తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావాలని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. మరి ఇది జీవోకి పరిమితం అవుతుందో లేక కార్యరూపం దాల్చుతుందో చూడాలి.
![]() |
![]() |