![]() |
![]() |

లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఫ్యామిలీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన బావ, ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ తల్లి ఎస్.ఎస్.కాంతం(88) కన్నుమూసారు.
గతేడాది సెస్టెంబర్ 25న ఎస్పీ బాలు కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఎస్పీ బాలు చెల్లెలు ఎస్పీ శైలజా అత్తగారు(శుభలేక సుధాకర్ తల్లి) ఎస్.ఎస్. కాంతం చెన్నైలో కన్నుమూసారు. చెన్నై లో నివాసం ఉంటున్న శుభలేఖ సుధాకర్ తల్లి మూడు నెలల కిందట గుండెపోటుకు గురయ్యారు. అప్పటినుంచి ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీనితో పాటు వృద్దాప్య సమస్యలు తోడవడంతో మంగళవారం ఆమె కన్నుమూసారు.
సుధాకర్ తల్లి మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా రెండేళ్లక్రితం సుధాకర్ తండ్రి కృష్ణా రావు మృతి చెందారు. కృష్ణారావు, కాంతం దంపతులకు ముగ్గురు కుమారులు కాగా.. సుధాకర్ పెద్ద కొడుకు.
![]() |
![]() |