![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 'గబ్బర్ సింగ్' వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ నుండి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ ను, పవన్ లుక్ ను రివీల్ చేస్తూ పోస్టర్ ను విడుదల చేసింది మూవీ టీమ్.
ఈ సినిమా నుంచి గురువారం ఉదయం పవర్ ప్యాక్డ్ అనౌన్స్ మెంట్ ఒకటి ఉంటుందని బుధవారం మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్లుగానే పవర్ ప్యాక్డ్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. మూవీ టైటిల్ ను, పవన్ లుక్ ను రివీల్ చేస్తూ మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ముందుగా ప్రచారం జరిగినట్లుగానే ఈ మూవీకి 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అలాగే పోస్టర్ లో పవన్ లుక్ ఆకట్టుకుంటోంది. బైక్ మీద కూర్చొని చేతిలో టీ గ్లాస్ పట్టుకొని చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు పవన్. లేటెస్ట్ పోస్టర్ తో ఈ మూవీపై అంచనాలు మరింత పెంచేశారు.

కాగా, ప్రస్తుతం 'భీమ్లా నాయక్', 'హరిహర వీరమల్లు' సినిమాలతో బిజీగా ఉన్న పవన్.. అవి పూర్తైన తర్వాత హరీష్ తో సినిమా చేయనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీలో పవన్ కు జోడీగా పూజా హెగ్డే నటించనుందనే టాక్ వినిపిస్తోంది.
![]() |
![]() |