![]() |
![]() |

`మజిలీ`, `వెంకిమామ` వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తరువాత యువ సామ్రాట్ నాగచైతన్య నుంచి రాబోతున్న సినిమా `లవ్ స్టోరి`. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో చైతూకి జంటగా సాయిపల్లవి దర్శనమివ్వనుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాని వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న విడుదల చేయబోతున్నట్లు కొద్దిరోజుల క్రితం అధికారిక ప్రకటన ఇచ్చింది యూనిట్. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు కెరీర్ లో మెమరబుల్ మూవీస్ గా నిలిచిన `ప్రేమనగర్` (1971), `మేఘ సందేశం` (1982).. ఏ తేదీన విడుదలయ్యాయో అదే సెప్టెంబర్ 24న `లవ్ స్టోరి`ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే నయా రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. తాతయ్య ఏయన్నార్ క్లాసిక్స్ డేట్ కి రాబోతున్న చైతూ.. ఎలాంటి ఫలితాన్ని, గుర్తింపుని పొందుతాడో చూడాలి.
కాగా, చైతూ ప్రస్తుతం `లాల్ సింగ్ చద్ధా` (హిందీ), `థాంక్ యూ`, `బంగార్రాజు` చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అలాగే విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ఓ హారర్ వెబ్ - సిరీస్ కూడా చేయబోతున్నాడు.
![]() |
![]() |